ESIC Recruitment : హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ లో ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. భోనానుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఫ్యాకల్టీకి 69 ఏళ్లు, సూపర్ స్పెషలిస్టుకు 69ఏళ్లు, స్పెషలిస్టుకు 66 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ కు 45 ఏళ్లు ఉండాలి.

Hyderabad ESIC Medical College
ESIC Recruitment : హైదరాబాద్ సనత్ నగర్ లోని ఎంప్లాయిూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఈ ఎస్ఐసీ) మెడికల్ కళాశాలలో ఒప్పంద ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేస్తారు. ఖాళీల వివరాలకు సంబంధించి ప్రొఫెసర్ 9ఖాళీలు, అసోసియేట్ ప్రొఫెసర్ 22 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 35 ఖాళీలు, సీనియర్ రెసిడెంట్ 73 ఖాళీలు, స్పెషలిస్ట్ 13 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ 14 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. భోనానుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఫ్యాకల్టీకి 69 ఏళ్లు, సూపర్ స్పెషలిస్టుకు 69ఏళ్లు, స్పెషలిస్టుకు 66 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ కు 45 ఏళ్లు ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి అకడమిక్ క్వాలిఫికేషన్ మార్కులు, టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్ , పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను సెప్టెంబర్ 13, 2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW.ESIC.NIC.IN పరిశీలించగలరు.