IBPS PO Admit Cards : ప్రిలిమ్స్ పరీక్ష కోసం ఐబీపీఎస్ పీఓ అడ్మిట్ కార్డ్‌లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

IBPS PO Admit Cards : ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసేందుకు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయొచ్చు.

IBPS PO Admit Cards : ప్రిలిమ్స్ పరీక్ష కోసం ఐబీపీఎస్ పీఓ అడ్మిట్ కార్డ్‌లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

IBPS PO Admit Cards Released For Prelims Exam

Updated On : October 11, 2024 / 10:18 PM IST

IBPS PO Admit Cards : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్, పర్సనల్ సెలక్షన్ (IBPS) ఐబీపీఎస్ పీఓ 2024 అడ్మిట్ కార్డ్‌లను అక్టోబర్ 11, 2024న విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసేందుకు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయొచ్చు. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసే వారు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి. అడ్మిట్ కార్డ్ 2024లో పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, రిపోర్టింగ్ టైమ్, షిఫ్ట్ టైమ్, ఇతర వివరాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

అక్టోబర్ 19, అక్టోబర్ 20, 2024న ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డ్‌లు విడుదల అయ్యాయి. ఐబీపీఎస్ పీఓ సీఆర్‌పీ 14 పరీక్ష కోసం 3,955 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే కార్డ్‌లు జారీ అయ్యాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్‌లో 3,955 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఖాళీల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి :

  • ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • “CRP-PO/MT”పై క్లిక్ చేయండి. కొత్త పేజీ డిస్‌ప్లే అవుతుంది.
  • “ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ-ఎక్స్ఐవీ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్”పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీలో “IBPS PO/MTs-XIV ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్”పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్ /డీఓబీని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్‌ను నింపండి.
  • అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఐబీపీఎస్ పీఓ అడ్మిట్ కార్డ్ 2024ని సేవ్ చేయండి
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.

Read Also : CBSE CTET Exam Date : సీబీఎస్ఈ సీటెట్ ఎగ్జామ్ కొత్త డేట్ ఇదే.. ఈ నెల 16వరకే దరఖాస్తుకు ఛాన్స్..!