B.Tech అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 05:59 AM IST
B.Tech అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Updated On : November 5, 2019 / 5:59 AM IST

ఇండియన్ ఆర్మీ నిరుద్యోగ అభ్యర్ధుల కోసం టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC) ద్వారా 40 పోస్టుల్ని, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ (TES) ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత:
అభ్యర్ధులు ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ పాస్ కావాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 70% మార్కులు ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్ధులకు వయస్సు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 12, 2019.

దరఖాస్తు చివరితేది: నవంబర్ 14, 2019.

దరఖాస్తు కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..