IIT Delhi Recruitment : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంజనీరింగ్‌/టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

IIT Delhi Recruitment : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

Indian Institute of Technology Job Vacancies

Updated On : November 14, 2022 / 8:23 PM IST

IIT Delhi Recruitment : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 సూపరింటెండింగ్‌ ఇంజనీరింగ్, మెడికల్ ఆఫీసర్‌, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్‌, చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంజనీరింగ్‌/టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.

ఖాళీల వివరాలకు సంబంధించి సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులు 2, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 7, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు 1, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 2, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 3, మెడికల్ ఆఫీసర్ పోస్టులు 2, అసిస్టెంట్ స్టూడెంట్ కౌన్సెలర్ పోస్టులు 2 ఉన్నాయి. అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; చిరునామా: రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నం. 207/C-7,  డైరెక్టర్ (Ops) కార్యాలయం, IIT ఢిల్లీ, హౌజ్-ఖాస్, న్యూఢిల్లీ – 110016. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://home.iitd.ac.in/ పరిశీలించగలరు.