ISRO Online Courses : ఇస్రో ఉచిత ఆన్ లైన్ కోర్సులు..అర్హులు ఎవరంటే ?
ఈ కోర్సులో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో కూడిన రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని విద్యార్థులకు బోధిస్తారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్, జియో స్టేషనరీ, సన్ సింక్రసన్ శాటిలైట్, రిమోట్ సెన్సార్స్ రకాలు, మల్టీస్పెక్ట్రల్ స్కానర్సర్, రిమోట్ సెన్సింగ్ వంటి అంశాలను బోధిస్తారు.

ISRO free online courses..who are eligible?
ISRO Online Courses : భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో కోర్సులకు అవకాశం కల్పిస్తోంది. 8వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ కోర్సులో భాగంగా రిమోట్ సెన్సింగ్, జియో ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌తో పాటు గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తారు. అంతరిక్ష జిగ్నాసా ప్రోగ్రామ్‌లో భాగంగా ఇస్రో ఈ కోర్సులను అందిస్తోంది.
ఈ కోర్సులో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో కూడిన రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని విద్యార్థులకు బోధిస్తారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్, జియో స్టేషనరీ, సన్ సింక్రసన్ శాటిలైట్, రిమోట్ సెన్సార్స్ రకాలు, మల్టీస్పెక్ట్రల్ స్కానర్సర్, రిమోట్ సెన్సింగ్ వంటి అంశాలను బోధిస్తారు. తరగతుల్లో అందరికీ అర్థమయ్యేలా విధంగా, ఫొటోలు, యానిమేసన్స్‌తో వివరిస్తారు.
విద్యార్థులకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, భూ గ్రహంపై అవగాహన కల్పించేందుకు ఇస్రో ఈ తరగతులును నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తొలుత ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, సందేహాలు నివృత్తి కోసం websupport@iirs.gov.in. ఐడీకి మెయిల్ చేయటం ద్వారా పొందవచ్చు.