ITDA Training: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గవర్నమెంట్ జాబ్ మీ కలనా.. అయితే ఈ ఉచిత శిక్షణ మీకోసమే

ఐటీడీఏ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణను అందించనున్నారు.

ITDA Training: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గవర్నమెంట్ జాబ్ మీ కలనా.. అయితే ఈ ఉచిత శిక్షణ మీకోసమే

itda training center

Updated On : June 7, 2025 / 12:24 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఐటీడీఏ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణను అందించనున్నారు. డిగ్రీ పాసై ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న గిరిజన అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు సాదించేందుకు శిక్షణ ఇస్తున్నారు. గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్, రైల్వే, ఎస్‌ఎస్‌సి లాంటి ఇతర ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం ఈ శిక్షణ జరుగనుంది. రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ మేరకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా అధికారిక ప్రకటన చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో గతంలో కూడా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను అందించినట్లు చెప్పారు. ఇప్పటికే చాలా మంది గిరిజన నిరుద్యోగులు ఇక్కడ శిక్షణ పొంది ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన గిరిజన అభ్యర్థులు, గతంలో ఎలాంటి శిక్షణ పొందని అభ్యర్థుల నుంచి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి శిక్షణ కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తీసుకోవాలనుకునే అభ్యర్థులు studycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ముందుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ దరఖాస్తుల గడువు జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.