JNVST 2025 Results: నవోదయ 6వ, 9వ తరగతుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టినరోజు వంటి వివరాలతో ఫలితాలు చూసుకోవచ్చు.

JNVST 2025 Results: నవోదయ 6వ, 9వ తరగతుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

Updated On : March 25, 2025 / 4:12 PM IST

దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాలు కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇవాళ రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షను ఈ ఏడాది జనవరి 18న నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ పరీక్ష ఫలితాలనే ఇవాళ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST) ప్రకటించింది.

విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, జన్మదినం వంటి వివరాలతో ఫలితాలు చూసుకోవచ్చు. 6వ, 9వ తరగతిలో ఉన్న ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి అధికారులు రెండు వెయిటింగ్‌ లిస్టులను ఉంచుతారు.

ఒకవేళ పరీక్ష రాసి ఎంపికైనప్పటికీ నవోదయ విద్యాలయాల్లో చేరనివారు, సరైన సర్టిఫికెట్లు సమర్పించని వారు ఆ స్కూళ్లలో ప్రవేశాలు పొందలేరు. వారి స్థానంలో మిగతా విద్యార్థులకు వెయిటింగ్‌ లిస్ట్‌ ద్వారా అవకాశాలు ఉంటాయి. ఇక పర్వత ప్రాంతాల్లో వచ్చేనెల 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి

  • navodaya.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి
  • హోమ్‌పేజీలో ‘JNVST క్లాస్ 6 ఫలితం 2025’ క్లిక్ చేయండి
  • 9వ తరగతి ప్రవేశాలకు పరీక్ష రాసిన వారు ‘JNVST క్లాస్ 9 రిజల్ట్‌ 2025’ లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ రోల్ నంబర్, పుట్టినరోజు తేదీని ఎంటర్ చేయండి
  • మీ ఫలితాలు వస్తాయి
  • కాపీని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి
  • ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థులు మీ సమీపంలోని జేఎన్‌వీకి వెళ్లవచ్చు