అద్భుతమైన అవకాశం.. టెన్త్ పాసైతే చాలు ఉద్యోగం.. మంచి జీతం.. వివరాలు మీకోసం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 22న జాబ్ మేళా నిర్వహించనున్నారు.

అద్భుతమైన అవకాశం.. టెన్త్ పాసైతే చాలు ఉద్యోగం.. మంచి జీతం.. వివరాలు మీకోసం

JOb mela in Ap

Updated On : June 21, 2025 / 3:48 PM IST

నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 22న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ లాంటి విద్యార్హతలు ఉన్న ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు.

ఇక ఈ జాబ్ మేళాలో దాదాపు 12 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. జాబ్ మేళాకు వచ్చేవారు తప్పకుండ అడ్మిట్ కార్డు, రెజ్యూమె, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని, తప్పకుండ ఫార్మల్ డ్రెస్‌లోనే రావాలని సూచించారు. ఇక జాబ్ మేళ జూన్ 22 ఆదివారం ఉందయం 9 గంటలకు మొదలుకానుంది.