Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. APSSDC అద్వర్యంలో భారీ జాబ్ మేళా.. పూర్తి వివరాలు మీకోసం

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జూలై 21న నంద్యాలలో ఈ జాబ్ మేళా జరుగనుంది.

Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. APSSDC అద్వర్యంలో భారీ జాబ్ మేళా.. పూర్తి వివరాలు మీకోసం

Mega Job Mela At Nandyala

Updated On : July 18, 2025 / 10:10 AM IST

నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రేదేశ్ ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తూ లక్షలాది మందికి ఉద్యోగాలు అందిస్తోంది. ఇందులో భాగంగానే నంద్యాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జూలై 21న నంద్యాలలో ఈ జాబ్ మేళా జరుగనుంది. నంద్యాల పట్టణంలోని NTR షాదీఖానా ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు మొదలుకానున్న ఈ జాబ్ మేళాలో మొత్తం 11 ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. కాబట్టి, ఈ అద్భుతమైన అవకాశాన్ని యువత తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

10వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ, బీ పార్మాసీ, డిగ్రీ, డిప్లొమా, ITI లేదా PG చేసిన ఏ అభ్యర్థులైన ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అలాగే ఈ జాబ్ మేళాకు ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అభ్యర్థులు నేరుగా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇక అభ్యర్థులు తమతోపాటు రెండు కాపీలు అప్‌డేటెడ్ రెజ్యూమ్, అసలు సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది. మరిన్ని సందేహాల కోసం అధికారిక వెబ్ సైట్ naipunyam.ap.gov.in ను సంప్రదించవచ్చు. అలాగే నంద్యాల APSSDC హెల్ప్‌లైన్ నంబర్ 8297-812-530 ను కూడా సంప్రదించవచ్చు.