Job Mela: పది పాసైతే జాబ్ గ్యారంటీ.. 11 కంపెనీలు, 500 పైగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం

Job Mela: నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా జరుగనుంది. కర్నూలు జిల్లాలో ఆగస్టు 14వ తేదీన ఈ జాబ్‌మేళా జరుగనుంది.

Job Mela: పది పాసైతే జాబ్ గ్యారంటీ.. 11 కంపెనీలు, 500 పైగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం

Job fair on August 14th in Kurnool district

Updated On : August 12, 2025 / 12:53 PM IST

ఆంద్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా జరుగనుంది. కర్నూలు జిల్లాలో ఆగస్టు 14వ తేదీన ఈ
జాబ్‌మేళా జరుగనుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారిక ప్రకటన చేశారు. అలాగే జాబ్ మేళాకి సంబందించిన పోస్టర్‌లను కూడా విడుదల చేశారు. ఇక ఈ జాబ్‌మేళాకు 11 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు హాజరుకానున్నాయి, 500 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. కాబట్టి, జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్న ఈ జాబ్ మేళాను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

విద్యార్హత:
పదవ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

వయోపరిమితి:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి.

అయితే అభ్యర్థులు ముందుగా ముందుగా Naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్ మేళాకు సంబందించిన మరిన్ని వివరాలు, సందేహాల కోసం 9059290821, 7780478910 ఈ నంబర్లను సంప్రదించవచ్చు.