Indian Coast Guard Jobs: టెన్త్ పాస్ అయితే చాలు.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవడానికి ఆఖరి తేదీ నవంబర్..

Indian Coast Guard Jobs: టెన్త్ పాస్ అయితే చాలు.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా..

Updated On : October 11, 2025 / 6:47 PM IST

Indian Coast Guard Jobs: మీరు టెన్త్ పాసయ్యరా. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా. ఈ వార్త మీ కోసమే. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు పడ్డాయి. గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పొజిషన్స్ ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవడానికి ఆఖరి తేదీ నవంబర్ 11.

వయసు:
పోస్టు బట్టి వయసు ఉంది. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులు.

ఎంపిక ప్రక్రియ:
స్క్రూటినీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక.

గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ పాస్ అయి ఉండాలి. మోటర్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ పోస్ట్ కి అభ్యర్థులు కచ్చితంగా హెవీ, లైట్ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు కూడా పని అనుభవం ఉండాలి.

మోటర్ వెహికల్ డ్రైవర్, ఎంటీఎస్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 27ఏళ్లు ఉండాలి.

* ఆఫ్ లైన్ లోనే అప్లయ్ చేసుకోవాలి.
* అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి (joinindiancoastguard.cdac.in) నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
* ఇంగ్లీష్ లేదా హిందీలో జాగ్రత్తగా అప్లికేషన్ నింపాలి.
* నిర్ణీత స్థలంలో లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి.
* వయస్సు రుజువు, విద్యా ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే), చెల్లుబాటు అయ్యే ఐడీ, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లతో సహా అవసరమైన అన్ని పత్రాల స్వీయ-ధృవీకరించబడిన కాపీలను జత చేయండి.
* ఫారమ్‌తో రూ.50 విలువైన పోస్టల్ స్టాంప్‌ను జత చేయండి.

ఈ అడ్రస్ కు అప్లికేషన్ ను పంపాలి..
The Commander, Coast Guard Region (A&N),
Post Box No. 716, Haddo (PO),
Port Blair – 744102,
Andaman & Nicobar Islands.

Also Read: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. గూగుల్ పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు!