కేజీ టు పీజీ : గురుకుల అప్లికేషన్లకు మార్చి 10 లాస్ట్ డేట్

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 06:10 AM IST
కేజీ టు పీజీ : గురుకుల అప్లికేషన్లకు మార్చి 10 లాస్ట్ డేట్

Updated On : March 6, 2019 / 6:10 AM IST

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ విద్యావిధానం విషయంలో గురుకులాల్లో ఎంట్రీ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 10గా విద్యాశాఖ  ప్రకటించింది. కేజీ టు పీజీ విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గురుకులాల్లో 5వ తరగతిలో ఎంట్రీ కోసం విద్యార్థులకు కామన్ ఎంట్రీ  ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 
Also Read : ఎట్టా ఇచ్చారు : ఆకాశంలో భూమి.. నకిలీ మనుషులు.. రూ.2 కోట్ల బ్యాంక్ లోన్

ఈ క్రమంలో 2019-20 విద్యాసంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశానికి మార్చి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. గురుకుల విద్యార్ధులకు మోస్ట్ ఎక్స్ పీరియన్స్ కలిగిన టీచర్స్ తో టీచింగ్ ను అమలు చేస్తున్నారు. గురుకులంలో చేరిన రోజు నుంచి రోజుకు 24 గంటలపాటు ప్రతి విద్యార్థిపై టీచర్స్ పర్యవేక్షణ ఉంటుంది.

ఐఐటీ, ఎంసెట్, నీట్ వంటి అనేక పోటీ పరీక్షలకు ట్రైనింగ్ ఇస్తూ బెస్ట్ ర్యాంకులతో అత్యున్నత స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండానే ఉచితంగా నాణ్యమైన విద్యను అందుతుండటంతో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

దరఖాస్తుకు సంబంధించి సందేహాల నివృత్తి, గురుకుల పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800–425–45678 నంబర్‌లో లేదా http://tswreis.in, http://tresidential. cgg.gov.in, http://tgtwgurukulam. telangana.gov.in, http://mjptb cwreis.cgg.gov.in, http://tgcet.cgg. gov.in వెబ్‌సైట్‌లను చూడాలని సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
Also Read : దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు