KIOCL Job Vacancies : కేఐవోసీఎల్ బెంగుళూరు లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీజీ లేదా తత్సమాన కోర్సులో త్తీర్ణత సాధించి ఉండాలి.

KIOCL Bangalore Job Vacancies
KIOCL Job Vacancies : బెంగళూరులోని కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (కేఐవోసీఎల్)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మైనింగ్, ఫైనాన్స్, మెటీరియల్, కమర్షియల్, ఎలక్ట్రికల్, ట్రైనింగ్ అండ్ సేఫ్టీ, జియాలజీ, స్ట్రక్చరల్, సర్వే విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీజీ లేదా తత్సమాన కోర్సులో త్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 యేళ్ల నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైనవారికి పోస్టును బట్టి రూ.50,000ల నుంచి రూ.2,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 3, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://kioclltd.in/ పరిశీలించగలరు.