మార్చి 25 నుంచి మెడికల్ పీజీ కౌన్సిలింగ్

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 09:35 AM IST
మార్చి 25 నుంచి మెడికల్ పీజీ కౌన్సిలింగ్

Updated On : March 10, 2019 / 9:35 AM IST

ఏపీలో మెడికల్ PG సీట్ల భర్తీకి మార్చి 25 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మార్చి 17 నుంచి 23 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో PG సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ జరగనుండగా.. మార్చి 25 నుంచి రాష్ట్రాల్లోని వర్సిటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని PG సీట్ల భర్తీకి మొదటి విడద కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 

దేశవ్యాప్తంగా 165 నగరాల్లో ఈ ఏడాది జనవరి 6న నిర్వహించిన నీట్ (PG) 2019 పరీక్షలకు 1,48,000 మంది అభ్యర్థలు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను జనవరి 31న విడుదలచేశారు. ఈ ఫలితాల ఆధారంగా దేశంలోని వివిధ వైద్యకళాశాలల్లో MD, MS, PG డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.