Mini Job Mela: బంపర్ ఆఫర్.. సొంత జిల్లాలో ఉద్యోగం.. రూ.20 వేలు జీతం.. అస్సలు మిస్ అవకండి

Mini Job Mela: నంద్యాల జిల్లాలోని నేషనల్ ఐటీఐ కాలేజ్ జ్ఞానాపురం, మూలసాగరం రోడ్లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈమేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి. దీప్తి అధికారిక ప్రకటన చేశారు.

Mini Job Mela: బంపర్ ఆఫర్.. సొంత జిల్లాలో ఉద్యోగం.. రూ.20 వేలు జీతం.. అస్సలు మిస్ అవకండి

Mini Job Mela at National ITI College in Nandyal district

Updated On : July 14, 2025 / 2:20 PM IST

చదువైపోయి ఉద్యోగం కోసం చేస్తున్నవారి కోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉగ్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నంద్యాల జిల్లాలోని నేషనల్ ఐటీఐ కాలేజ్ జ్ఞానాపురం, మూలసాగరం రోడ్లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈమేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి. దీప్తి అధికారిక ప్రకటన చేశారు. ఈ నెల (జులై) 15న ఉందయం 9:30 ని జాబ్ మేళా మొదలవుతుంది అని, ఈ జాబ్ మేళాలో మహీంద్రా అండ్ మహీంద్రా, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, నిరుద్యోగులు ఈ అద్భుత అవకాశాన్ని తప్పకుండ వినియోగించుకోవాలని ఆమె కోరారు.

విద్యార్హతలు:
పదవ తరగతి నుంచి బీఎస్సి వరకు ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

జీతం వివరాలు:
ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20 వేల జీతం ఇస్తారు.

అవసరమయ్యే ధ్రువపత్రాలు: ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్, విద్యార్హత జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి. అలాగే అభ్యర్థులు ఖచ్చితంగా ఫార్మల్ డ్రెస్ లోనే రావాల్సి ఉంటుంది.

ఇంకా ఏమైనా సందేహాల కోసం, మరిన్ని వివరాలకు కోసం హెల్ప్ లైన్ నంబర్స్ 9392533678, 9908114205 లను సంప్రదించ్చవచ్చు.