Nos : విదేశీ విద్యకు నేషనల్ ఓవర్సీస్ ఆర్ధిక సాయం

స్కాలర్ షిప్ అర్హతల విషయానికి వస్తే విదేశాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే విద్యార్థులు డిగ్రీ పాసై ఉండాలి. పీహెచ్‌డీకి దరఖాస్తు చేసే విద్యార్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.

Nos : విదేశీ విద్యకు నేషనల్ ఓవర్సీస్ ఆర్ధిక సాయం

Nos Scholarships

Updated On : February 24, 2022 / 12:48 PM IST

Nos : ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించలేని వారికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సాకారం అందిస్తుంది. నేషనల్ ఓవర్ సిస్ స్కాలర్ షిప్ లను అందిస్తూ విదేశీ విద్యాకు ప్రోత్సాహం అందిస్తుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, వ్యవసాయ కూలీ కుటుంబాల విద్యార్థులు, సంప్రదాయ కళాకారులు ఈ స్కాలర్ షిప్ లకు అర్హులు. ప్రతి ఏడాది 125మందికి స్కాలర్‌షిప్‌లను అందజేయనున్నారు. వీటిల్లో షెడ్యూల్డ్‌ కులాలకు115, తెగలకు 6, భూమిలేని వ్యవసాయ కూలీలకు, సంప్రదాయ కళాకారులకు 4 కేటాయించారు.

మాస్టర్స్‌ డిగ్రీ చేసేవారికి మూడేళ్లకు, పీహెచ్‌డీ చేసేవారికి నాలుగేళ్ల కాలానికి స్కాలర్‌షిప్‌ను మంజూరు చేస్తారు. ట్యూషన్‌ ఫీజు, మెయింటెనెన్స్‌ అలవెన్స్‌, అత్యవసర ఖర్చులు, వీసా ఫీజు, ఎక్విప్‌మెంట్‌ అలవెన్స్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తదితర ఖర్చులకుగాను స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్ షిప్ అందజేస్తారు. ఈ నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

స్కాలర్ షిప్ అర్హతల విషయానికి వస్తే విదేశాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే విద్యార్థులు డిగ్రీ పాసై ఉండాలి. పీహెచ్‌డీకి దరఖాస్తు చేసే విద్యార్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 35 ఏళ్లల్లోపుగా ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలు మించరాదు. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్నిసమర్పించాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తులో అప్ లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్ల వివరాలకు సంబంధించి టెన్స్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌, కులద్రువీకరణ పత్రం, పొటో, స్కాన్ చేసిన సిగ్నేచర్‌, కరెంట్‌, పర్మనెంట్‌ అడ్రస్‌ ఫ్రూఫ్‌, డిగ్రీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌, అర్హత పరీక్షకు సంబంధించి ప్రతి సెమిస్టర్‌లో మార్క్‌షీట్స్‌, ప్రూఫ్‌ ఆఫ్‌ సీజీపీఏ, ఎస్‌జీపీఏ, ఫారిన్‌ యూనివర్సిటీ ఆఫర్‌ లెటర్‌, కుటుంబ ఆదాయ ధ్రువపత్రం, అభ్యర్థి ఆదాయపు పన్ను కడుతున్నట్లయితే ఇన్‌కంటాక్స్‌ రిటర్న్‌, అభ్యర్ధి ఉద్యోగి అయితే నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తదితరాలు ఉన్నాయి. ప్రవేశం పొందిన విదేశీ యూనివర్సిటీ, విద్యాసంస్థ వివరాలను దరఖాస్తులో తెలియజేయాలి. అన్‌కండిషనల్‌ ఆఫర్‌ లెటర్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదిగా 31 మార్చి2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.nosmsje.gov.in సంప్రదించగలరు.