NEET : నీట్ – యూజీ సిలబస్ కుదింపు

నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నీట్ (యూజీ) -2024 సిలిబస్ ను ఖరారు చేసిందని, దీన్ని నీట్ అభ్యర్థులు గమనించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.

NEET : నీట్ – యూజీ సిలబస్ కుదింపు

NEET - UG

Updated On : November 23, 2023 / 7:23 AM IST

NEET – UG Syllabus : వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయి పరీక్ష నీట్ – యూజీ సిలబస్ ను తగ్గించారు. సీబీఎస్ఈ, ఇతర స్కూల్ బోర్డులు హేతుబద్ధీకరించిన పాఠ్యాంశాలకనుగుణంగా సిలబస్ ను కుదించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నీట్ (యూజీ) -2024 సిలిబస్ ను ఖరారు చేసిందని, దీన్ని నీట్ అభ్యర్థులు గమనించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఎన్ఎంసీ వెబ్ సైట్ లో తుది సిలబస్ అప్ లోడ్ అయిందని, సవరించిన సిలబస్ ను చెక్ చేసుకోవాలని సూచించింది. నీట్ అనేది దేశవ్యాప్తంగా ఔత్సాహిక వైద్య విద్యార్థులకు ప్రాథమిక గేట్ వే. నీట్ సిలబస్ 2024 ఇప్పటికే ఉన్న దానితో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు.

Coca-Cola Tea : భారతదేశం మార్కెట్‌లో ఇక కొత్తగా కోకా కోలా టీ…కొత్తగా ప్రారంభం

నీట్ సిలబస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులు ఉన్నాయి. 11, 12వ తరగతి పాఠ్యాంశాల నుండి అవసరమైన అంశాలను నొక్కి చెబుతాయి. నీట్ సిలబస్ లో ప్రధానంగా మూడు ప్రధాన సబ్జెక్టులు ఫిజిక్స్, కెమస్ట్రీ, బయాలజీ ఉన్నాయి. నీట్ 2024 సిలబస్ మునుపటి సంవత్సరం (నీట్ 2023) మాదిరిగానే ఉంటుంది.

అందువల్ల పరీక్షా విధానం, పాఠ్యాంశాల్లో విద్యార్థులు తమను తాము తెలుకోవాలి. అంతేకాకుండా నీట్ సిలస్ ప్రధానంగా 11, 12 వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుండి అధునాతన మరియు ప్రాథమిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది.