అప్లై చేసుకోండి : నార్త్ సెంట్రల్ రైల్వే లో అప్రెంటిస్ ఉద్యోగాలు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు శుభవార్త. నార్త్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 296 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
ఫిట్టర్ – 60
వెల్డర్ – 10
మెషినిస్ట్ – 10
పెయింటర్ – 12
కార్పెంటర్ – 14
ఎలక్ట్రీషియన్ -90
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటనెన్స్ – 15
ప్లంబర్ – 16
డ్రాఫ్ట్స్ మన్ (సివిల్) – 12
స్టెనోగ్రాఫర్(ఇంగ్లీష్) – 20
వైర్ మెన్ – 16
మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ – 15
హెల్తె శానిటరీ ఇన్ స్పెక్టర్ – 06
విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటిఐ ఉండాలి.
వయోపరిమితి : అభ్యర్ధులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసీ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులకు, మహిళా అభ్యర్ధులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభం : డిసెంబర్ 09,2019
దరఖాస్తు చివరితేది : జనవరి 10,2020