NEIAH Recruitment : నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్‌ హోమియోపతిలో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, పోస్టు గ్రాడ్యుయేసన్‌, ఎంహెచ్‌ఏ లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి.

NEIAH Recruitment : నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్‌ హోమియోపతిలో ఉద్యోగ ఖాళీల భర్తీ

North Eastern in Degree of Ayurveda and Homeopathy Job Vacancies

Updated On : November 14, 2022 / 8:41 PM IST

NEIAH Recruitment : భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్‌ హోమియోపతిలో ఒప్పంద/ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 15 ఫైనాన్స్‌ మేనేజర్‌, ప్రిన్సిపల్‌, డిప్యూటీ డైరెక్టర్‌, మెడికల్ సూపరింటెండెంట్‌, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్‌, రేడియాలజిస్ట్, అనెస్తెటిస్ట్‌, సర్జికల్ స్పెషలిస్ట్, పీడియాట్రీషియన్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, ల్యాబొరేటరీ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, పోస్టు గ్రాడ్యుయేసన్‌, ఎంహెచ్‌ఏ లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి.

విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 45 రోజుల్లోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://neiah.nic.in/ పరిశీలించగలరు.