Chennai Nift : చెన్నై నిఫ్ట్ లో డిప్లోమా, పీజీ డిప్లోమా ప్రవేశానికి నోటిఫికేషన్

అప్పారెల్ ప్రొడక్షన్ అండ్ మర్కండైజింగ్ ప్రొగ్రామ్ కోర్సు ను పూర్తిచేసిన వారు మర్కండైజర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, శాంపిలింగ్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ వంటి ఉద్యోగ అవకాశాలన

Chennai Nift : చెన్నై నిఫ్ట్ లో డిప్లోమా, పీజీ డిప్లోమా ప్రవేశానికి నోటిఫికేషన్

Nift

Updated On : October 7, 2021 / 1:12 PM IST

Chennai Nift : చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లో డిప్లోమా, పీజీ డిప్లోమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్యాషన్ ఫిట్ అండ్ స్టయిల్ ప్రోగ్రామ్. ఇది యూజీ డిప్లోమా ప్రోగ్రామ్. కోర్సు వ్యవధి రెండేళ్ళు కాగా మొత్తం 35 సీట్లు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి తరువాత ఫుల్ టైమ్ డిప్లోమా కోర్సులు చేసినవారు సైతం ధరఖాస్తుచేసుకునేందుకు అర్హులు.

కోర్సు ఫీజు 2లక్షల రూపాయలు ఉంటుంది. కోర్సు పూర్తయిన వారికి డిజైనర్ , ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్టెంట్, డిజైన్ మేనేజర్, స్టయిలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ ట్రెండ్స్ ఆర్గనైజర్, పాట్రన్ ఇంజనీర్ గా రాణించవచ్చు. ఇక పీజీ డిప్లోమా ప్రొగ్రామ్స్ విషయానికి వస్తే ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది ఉంటుంది. ఏదైన డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి తరువాత డిప్లొమా కోర్సులు పూర్తిచేసి కనీసం రెండు,మూడు సంవత్సరాల అనుభం ఉన్నారిని పీజీ డిప్లోమాలో చేరేందుకు అర్హులే. ఒక్కో కోర్సులో 30 సీట్లు ఉన్నాయి.

అప్పారెల్ ప్రొడక్షన్ అండ్ మర్కండైజింగ్ ప్రొగ్రామ్ కోర్సు ను పూర్తిచేసిన వారు మర్కండైజర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, శాంపిలింగ్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ వంటి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ఓమ్నీ చానెల రిటైలింగ్ అండ్ ఈ కామర్స్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ కోర్సును పూర్తిచేసిన వారు డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్ మెంట్ , కంటెట్ మార్కెటింగ్, డిజిటల్ అడ్వర్టయిజింగ్ అండ్ బ్రాండింగ్, మార్కెటింగ్ అనలిటిక్స్, పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్లో ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ షిప్ కోర్సు పూర్తిచేసిన వారికి బిజినెస్ కన్సల్టెంట్, న్యూ వెంచర్ డెవలపర్ గా రాణించవచ్చు.

ధరఖాస్తు చేయటానికి అక్టోబరు 11ను చివరి తేదిగా నిర్ణయించారు. క్వాలిఫయింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. క్వాలిఫయింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలు అక్టోబరు 15 నుండి 15వరకు జరుగుతాయి. ధరఖాస్తు ఫీజు 2150రూపాయలు, ఫలితాలను అక్టోబరు 23న విడుదల చేస్తారు. నవంబరు 1 నుండి తరగతలు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.nift.ac.in/chennai