NIms : నిమ్స్ లో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుకు నోటిఫికేషన్
తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ఈ కోర్సులకు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శీటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ (బీపీటీ) ఉత్తీర్ణులై ఉండాలి. సె

Nims
NIms : హైద్రాబాద్ పంజాగుట్టలోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ అయింది. రెండేళ్ళ వ్యవధి కలిగిన ఈ కోర్సులో మాస్క్యులో స్కెలిటల్ సైన్సెస్, కార్డియోవాస్క్యులర్ అండ్ పల్మనరీ సైన్సెస్, న్యూరో సైన్సెస్ స్పెషలైజేషన్ లు ఉన్నాయి. ఒక్కో విభాగంలో 5సీట్లు ఉండగా, అభ్యర్ధుల ఎంపిక చేసేందుకు ప్రవేశ పరీక్ష, కౌన్సిలింగ్ ప్రక్రియలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ఈ కోర్సులకు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శీటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ (బీపీటీ) ఉత్తీర్ణులై ఉండాలి. సెప్టెంబరు 30 వతేదికి ఆరు నెలల ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి. మరే ఇతర కోర్సుల్లో ప్రవేశం పొందకూడదు. అభ్యర్ధుల వయస్సు డిసెంబర్ 31 నాటికి 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిమ్స్ ఉద్యోగులకు వయోపరిమితి నిబంధనలు వర్తించవు.
అబ్జెక్టీవ్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మెరిట్ అధారంగా అభ్యర్ధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ధరఖాస్తు ఫీజు 1100 రూపాయలుగా నిర్ణయించారు. ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తుకు ఆఖరి తేది అక్టోబరు 10వతేది. ప్రవేశ పరీక్ష నవంబరు 10 ఉంటుంది. నవంబరు 12వ తేదిన ఫలితాలు వెల్లడిస్తారు. అభ్యర్ధుల మెరిట్ జాబితా నవంబరు 16న వెల్లడిస్తారు. నవంబరు 20 నుండి కౌన్సిలింగ్ ఉంటుంది. డిసెంబర్ 6 నుండి తరగతులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ nims.edu.in