IB ACIO Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. అప్లై చేసుకున్నారా? గడువు ముగుస్తోంది.. వెంటనే అప్లై చేసుకోండి
IB ACIO Recruitment: హోం మంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.

Notification released for the recruitment of ACIO posts in the Intelligence Bureau
నిరుద్యోగులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హోం మంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో మొత్తం 3717 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ జూలై 19 నుంచి మొదలవగా ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఆగస్టు 12 చివరి తేదీ. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మినిస్ట్రీ అఫ్ హోమ్ అఫైర్స్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
- అన్ రిజర్వ్డ్ వారికి 1537 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ వారికి 442 పోస్టులు
- ఓబీసీ వారికి 946 పోస్టులు
- ఎస్సీ వారికి 566 పోస్టులు
- ఎస్టీ వారికి 226 పోస్టులు
విద్యార్హత:
దరఖాస్తుదారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్ళు గరిష్ట వయసు 27 ఏళ్ళు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి వయస్సులో సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 జీతం ఇస్తారు. అలవెన్సులు, సదుపాయాలు కూడా అందుతాయి.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ మూడు విభగాల్లో జరుగనుంది. టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), టైర్-2 (డెస్క్రిప్టివ్ టైప్), ఇంటర్వ్యూ ఉంటుంది. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు.