NPCIL లో టెక్నీషియన్ ఉద్యోగాలు

న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 102 ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. అభ్యర్దులను రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
విభాగాల వారీగా ఖాళీలు :
సైంటిఫిక్ అసిస్టెంట్
– సివిల్ – 22
– మెకానిక్ – 21
– ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇన్ స్ట్రుమెంటేషన్ – 6
– ఎలక్ట్రికల్ – 7
టెక్నీషియన్ :
– సర్వేయర్ – 12
– డ్రాఫ్ట్స్ మెన్ – 1
– టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్ – 19
– ఎలక్ట్రిషియన్, వైర్ మెన్ – 7
– ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్ స్ట్రుమెంటేషన్ – 7
విద్యార్హత :
అభ్యర్ధులు 10వ తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ డిప్లామాలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
వయస్సు :
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల అభ్యర్దుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
టెక్నిషియన్ పోస్టుల అభ్యర్దుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం :
సైంటిఫిక్ అసిస్టెంట్ అభ్యర్ధులకు రూ. 35 వేల 400 ఇస్తారు.
టెక్నిషియన్ అభ్యర్ధులకు రూ. 21 వేల 700 ఇస్తారు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 15, 2020.
దరఖాస్తు చివరి తేదీ : జనవరి 31, 2020.