అప్లై చేసుకోండి : NPCIL లో ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 05:17 AM IST
అప్లై చేసుకోండి : NPCIL లో ఉద్యోగాలు

Updated On : December 16, 2019 / 5:17 AM IST

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 137 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్దులను రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

 విభాగాల వారీగా ఖాళీలు :
 –  డ్రైవర్ గ్రేడ్1 – 02
 – టెక్నీషియన్ B- 06 
 – స్టైఫండ్ ట్రైనీ,స్టైఫండ్ టెక్నీషియన్(క్యాటగిరి2) – 34
 –  సైంటిఫిక్ అసిస్టెంట్ B – 45
 –  స్టైఫండ్ ట్రైనీ, సైంటిఫిక్  అసిస్టెంట్(క్యాటగిరి1) – 50

విభాగాల వారీగా జీతాలు :
–  డ్రైవర్ గ్రేడ్1 – రూ.19 వేల 900
–  టెక్నీషియన్ B – రూ.21వేల 700
–  స్టైఫండ్ టెక్నీషియన్ (క్యాటగిరి 2) లో మెుదటి సంవత్సరం శిక్షణ కాలంలో నెలకు రూ.1500 ఇస్తుంది. రెండవ సంవత్సరం నుంచి నెలకు రూ. 12 వేల 500 చెల్లిస్తుంది.
–  సైంటిఫిక్ అసిస్టెంట్ B – నెలకు రూ.35 వేల 400 చెల్లిస్తుంది.
–  స్టైఫండ్ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్(క్యాటగిరి1)  లో మెుదటి సంవత్సరం శిక్షణ కాలంలో నెలకు రూ.16వేలు చెల్లిస్తుంది. రెండవ సంవత్సరం నుంచి నెలకు రూ 18వేలు చెల్లిస్తుంది.

విద్యార్హత :
అభ్యర్ధులు సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
 
విభాగాల వారీగా వయస్సు : 
–  డ్రైవర్ గ్రేడ్1 అభ్యర్ధులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
–  టెక్నీషియన్ B అభ్యర్ధులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
–  స్టైఫండ్ ట్రైనీ,స్టైఫండ్ టెక్నీషియన్(క్యాటగిరి2) అభ్యర్ధులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
–  సైంటిఫిక్ అసిస్టెంట్ B అభ్యర్ధులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
–  స్టైఫండ్ ట్రైనీ, సైంటిఫిక్  అసిస్టెంట్(క్యాటగిరి1) అభ్యర్దులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ముఖ్య తేదిలు : 
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 17,2019
దరఖాస్తు చివరి తేది : జనవరి 06,2020