నెలాఖరు కల్లా.. NTPC ‘స్టేజ్-1’ షెడ్యూలు వచ్చేస్తోంది!

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 09:07 AM IST
నెలాఖరు కల్లా.. NTPC ‘స్టేజ్-1’ షెడ్యూలు వచ్చేస్తోంది!

Updated On : November 15, 2019 / 9:07 AM IST

రైల్వే శాఖలోనికి NTPC ఉద్యోగాల భర్తీకి మార్చి నెల్లలో నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ గత నెలలో NTPC స్టేజ్ -1 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించి అభ్యర్ధులను షాక్ కు గురి చేసింది. తాజగా NTPC స్టేజ్-1 పరీక్ష తేదీలను త్వరలో విడుదల చేయనున్నట్లు రైల్వే బోర్డు  తెలిపింది. 

ఈ నెలాఖరులోగా స్టేజ్-1 పరీక్షల షెడ్యూలను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రైల్వే జోన్ల పరిధిలో వున్న 35 వేల 277 నాన్ టెక్నికల్ పాపులర్ (NTPC) పోస్టులకు ఫిబ్రవరి 28వతేదీన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో NTPC స్టేజ్-1 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి 7నెలలు గడిచిన పరీక్షలకు సంబంధించిన వివరాలను ఇంతవరకు ప్రకటించలేదు. త్వరలోనే పరీక్ష షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. షెడ్యూల్ ను ప్రకటిస్తే పరీక్షలకు పది రోజుల ముందే హాల్ టికెట్లు వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీలకు ముందుగా NTPC అప్లికేషన్ స్టేటస్ ను వెబ్ సైట్ లో ఉంచున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. 

పరీక్ష విధానం:

NTPC స్టేజ్ – 1, 2 పరీక్ష విధానం. మొత్తం 100 మార్కులకు ‘స్టేజ్-1’ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.

* పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కట్ చేస్తారు.

* పరీక్షలో అర్హత సాధించిన వారికి ‘స్టేజ్ – 2’ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 మార్కులకు స్టేజ్ – 2 పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.