నిజామాబాద్ కానిస్టేబుల్‌ను హత్య చేసిన రియాజ్ డెడ్‌బాడీకి పోస్ట్ మార్టమ్ పూర్తి.. రియాజ్‌పై 5 ఏళ్లలో 61 కేసులు
కుటుంబ సభ్యులకు రియాజ్ డెడ్ బాడీని అప్పగించారు.

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్‌పై పోలీసులు నిన్న కాల్పులు జరిపి హతమార్చిన విషయం తెలిసిందే. జీజీహెచ్ ఆసుపత్రి మార్చురీలో రియాజ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టమ్ పూర్తయింది.
అర్ధరాత్రి వరకు పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తరలించారు. కుటుంబ సభ్యులకు రియాజ్ డెడ్ బాడీని అప్పగించారు. బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో రియాజ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, నిన్న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీని లాక్కొని ట్రిగర్ నొక్కేందుకు ప్రయత్నించగా రియాజ్‌పై ఆర్‌ఐ కాల్పులు జరిపారు. రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేయడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.
రియాజ్ చేసిన దాడిలో గాయపడిన ఆసిఫ్‌కు హైదరాబాద్‌లో చికిత్స అందుతోంది. రియాజ్ దాడిలో మృతిచెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. గత ఐదేళ్లలో రియాజ్‌పై 61 కేసులు నమోదవ్వగా అందులో 50 దొంగతనం కేసులు ఉన్నాయి.