IAS IPS Posts Vacant : ఐఏఎస్‌లో 1300 పోస్టులు, ఐపీఎస్‌లో 586 పోస్టులు ఖాళీ : కేంద్రం
IAS IPS Posts Vacant : ఐఏఎస్‌లో 1,316 పోస్టులు, ఐపీఎస్‌లో 586 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

Over 1,300 Posts Vacant In IAS
IAS And IPS Posts : దేశంలో ప్రస్తుతం వెయ్యికి పైగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) పోస్టులు ఖాళీగా ఉండగా, ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఆఫీసర్లకు 500 కన్నా ఎక్కువ ఖాళీగా ఉన్నాయి. ఐఏఎస్‌లో 1,316 పోస్టులు, ఐపీఎస్‌లో 586 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. జనవరి 1, 2024 నాటికి మొత్తం 6,858 మంది ఐఏఎస్‌లలో 5,542 మంది అధికారులు పనిచేస్తున్నారని ఆయన రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఇప్పటివరకూ మంజూరైన 5,055 మంది ఐపీఎస్‌లకు 4,469 మంది ఐపీఎస్ అధికారులు మాత్రమే పనిచేస్తున్నారని మంత్రి సింగ్ తెలిపారు. ఖాళీగా ఉన్న 1,316 ఐఏఎస్ పోస్టుల్లో 794 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 522 పదోన్నతి కోసం ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న 586 ఐపీఎస్ పోస్టుల్లో 209 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 377 పదోన్నతికి సంబంధించినవిగా మంత్రి పేర్కొన్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)లో 3,193 మంది అధికారులు ఉండాలి. కానీ, 2,151 మంది అధికారులు మాత్రమే ఉన్నారని సింగ్ చెప్పారు. ఖాళీగా ఉన్న 1,042 ఐఎఫ్‌ఎస్ పోస్టుల్లో 503 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 539 ప్రమోషన్ పోస్టులు ఉన్నాయని తెలిపారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏడాది నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఎంపిక చేస్తారు. మంత్రి తన వివరణాత్మక సమాధానంలో గత ఐదేళ్లలో జనరల్, షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లకు జరిగిన నియామకాల వివరాలను కూడా షేర్ చేశారు.
2022 సంవత్సరపు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) సమయంలో ఐఏఎస్‌లో జనరల్ కేటగిరీ నుంచి 75, ఓబీసీ కేటగిరీ నుంచి 45, షెడ్యూల్డ్ కులాల నుంచి 29, షెడ్యూల్డ్ తెగల వర్గం నుంచి 13 నియామకాలు జరిగాయి. అదే సమయంలో ఐపీఎస్‌లో 83 జనరల్, 53 ఓబీసీ, 31 ఎస్సీ, 13 ఎస్టీ నియామకాలు జరిగాయి. మంత్రి షేర్ చేసిన డేటా ప్రకారం.. సీఎస్ఈ 2024 సమయంలో ఐఎఫ్ఎస్‌లో మొత్తం 43 జనరల్, 51 ఓబీసీ, 22 ఎస్సీ, 11 ఎస్టీ నియామకాలు జరిగాయి.
Read Also : CTET Admit Card 2024 : సీటెట్ అడ్మిట్ కార్డ్ 2024 విడుదల.. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?