Pragathi Scholarship : ప్రగతి స్కాలర్ షిప్ పధకం 2023..ఏడాదికి 50,000రూపాయలు

దరఖాస్తుదారులు రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్రీకృత ప్రవేశ ప్రక్రియ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో AICTE-ఆమోదించబడ్డ కళాశాల/ఇన్‌స్టిట్యూట్ యొక్క టెక్నికల్ డిప్లొమా/డిగ్రీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం లేదా 2వ సంవత్సరం (లేటరల్ ఎంట్రీ ద్వారా మాత్రమే)లో చేరి ఉండాలి.

Pragathi Scholarship : ప్రగతి స్కాలర్ షిప్ పధకం 2023..ఏడాదికి 50,000రూపాయలు

Pragathi Scholarship

Updated On : October 12, 2023 / 1:58 PM IST

Pragathi Scholarship : మహిళలను టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ప్రోత్సహించేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రతి ఏడాది ప్రగతి స్కాలర్ షిప్ లను అందజేస్తుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద, సాంకేతిక విద్యను అభ్యసించడానికి ప్రతిభావంతులైన మహిళా విద్యార్థులకు ప్రతి సంవత్సరం మొత్తం 5,000 మందికి స్కాలర్‌షిప్‌లు అంజేస్తున్నారు. సంవత్సరానికి 50,000 రూపాయలు ఎంపికైన ఒక్కో విద్యార్ధినికి అందజేస్తారు.

READ ALSO : Viral Video : జోరుగా .. హుషారుగా మోనో‌సైకిల్ నడుపుతున్న పెద్దాయన.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపిలో 566, తెలంగాణాకు 424 స్కాలర్ షిప్ లను కేటాయించారు. డిగ్రీ రెగ్యులర్ కోర్సులో చేరిన వారికి నాలుగు సంవత్సరాలు, లేటరల్ ఎంట్రీ అభ్యర్ధులకు మూడేళ్లపాటు ఏటా 50 వేల రూపాయలు అందజేస్తారు. కాలేజీ ఫీజు చెల్లింపు, పుస్తకాల కొనుగోలు, పరికరాల కొనుగోలు, ల్యాప్‌టాప్‌లు మరియు సాఫ్ట్‌వేర్‌ల కొనుగోలు, డెస్క్‌టాప్‌ల కొనుగోలు వంటి వాటికోసం ఈ మొత్తాన్ని అందిస్తారు.

2023 సంవత్సరం ప్రగతి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023గా నిర్ణయించారు. ప్రగతి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి విద్యార్ధినులు తప్పనిసరిగా AICTE- ఆమోదించబడిన కళాశాల/సంస్థలో చదువుతూ ఉండాలి.

READ ALSO : Cochin Shipyard : కొచ్చిన్ షిప్‌యార్డు లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ

AICTE ప్రగతి స్కాలర్‌షిప్ అర్హత ప్రమాణాల;

దరఖాస్తుదారులు రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్రీకృత ప్రవేశ ప్రక్రియ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో AICTE-ఆమోదించబడ్డ కళాశాల/ఇన్‌స్టిట్యూట్ యొక్క టెక్నికల్ డిప్లొమా/డిగ్రీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం లేదా 2వ సంవత్సరం (లేటరల్ ఎంట్రీ ద్వారా మాత్రమే)లో చేరి ఉండాలి. ఒక్కో కుటుంబానికి ఇద్దరు బాలికలు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా INR 8 లక్షలకు మించకూడదు.

READ ALSO : Lemon Grass Tea : నొప్పుల నుండి ఉపశమనం కలిగించంతోపాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే లెమన్ గ్రాస్ టీ !

దరఖాస్తు చేసుకునే విధానం ;

1. ముందుగా, దరఖాస్తుదారులు ‘న్యూ రిజిస్ట్రేషన్’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా NSP పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
2. రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవాలి. అన్ని వివరాలను పూర్తిచేయాలి.
3, వివరాల నమోదు తర్వాత, దరఖాస్తుదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అప్లికేషన్ ID , పాస్‌వర్డ్‌ను అందుతుంది.
4. అనంతరం అభ్యర్ధులు ప్రగతి దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి వారి అప్లికేషన్ ID మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి NSP పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
5. దరఖాస్తుదారులు తమ పాస్‌వర్డ్‌ను మార్చమని అడుగుతుంది. (తప్పనిసరి దశ).
6.ఆ తర్వాత, దరఖాస్తుదారులు స్కాలర్‌షిప్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
7.అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.

READ ALSO : World Record : మూడు నెలల పసిబిడ్డ ప్రపంచ రికార్డ్ ..!!

ప్రగతి స్కాలర్‌షిప్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించేటప్పుడు దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ వద్ద కొన్ని అవసరమైన పత్రాలు ఉంచుకోవాలి. అవేంటంటే ..

10వ తరగతి మార్కుషీట్, 12వ తరగతి మార్కు షీట్, ఆధార్ కార్డు, దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, అభ్యర్థి సంతకం, తహసీల్దార్ లేదా అంతకంటే ఎక్కువ కాంపిటెంట్ అథారిటీ ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో మునుపటి ఆర్థిక సంవత్సరం వార్షిక కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రస్తుత విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం డిగ్రీ/డిప్లొమా ప్రోగ్రామ్‌లకు సెంట్రలైజ్డ్ అడ్మిషన్ అథారిటీ జారీ చేసిన అడ్మిషన్ లెటర్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెల్లించిన ట్యూషన్ ఫీజు రసీదు ఆధార్-సీడెడ్ బ్యాంక్ పాస్‌బుక్, దరఖాస్తుదారు పేరు, ఖాతా నంబర్, IFSC కోడ్ మరియు ఫోటోపై అతికించబడిన బ్యాంక్ రబ్బర్ స్టాంప్‌తో మేనేజర్ సంతకం చేసిన తగిన స్థలంలో అతికించాలి.

READ ALSO : Supreme Court : మహిళ గర్భ విచ్చిత్తిపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు

నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం డైరెక్టర్/ప్రిన్సిపాల్/HOD జారీ చేసిన సర్టిఫికేట్ దరఖాస్తుదారు SC/ST/OBC కేటగిరీకి దరఖాస్తు చేస్తున్నట్లయితే, కుల ధృవీకరణ పత్రం యొక్క ధృవీకరించబడిన కాపీ దరఖాస్తుదారు అందించిన సమాచారం సరైనదేనని , ఏ దశలోనైనా ఏదైనా తప్పుడు సమాచారం అని తేలితే స్కాలర్‌షిప్ మొత్తం వాపసు చేయబడుతుందని తల్లిదండ్రులు సంతకం చేసిన డిక్లరేషన్ సిద్ధం చేసుకుని ఉండాలి.