RRC Notification: టెన్త్ అర్హతతో రైల్వే జాబ్స్.. 3115 పోస్టులు.. దరఖాస్తు, అర్హత వివరాలు మీకోసం

RRC Notification: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC తూర్పు రైల్వే), RRC ER అప్రెంటిస్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

RRC Notification: టెన్త్ అర్హతతో రైల్వే జాబ్స్.. 3115 పోస్టులు.. దరఖాస్తు, అర్హత వివరాలు మీకోసం

Railway Recruitment Cell has released a notification for the posts of RRC ER Apprentice.

Updated On : August 1, 2025 / 2:13 PM IST

రైల్వే జాబ్స్ కోసం చేస్తున్నవారికి గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC తూర్పు రైల్వే), RRC ER అప్రెంటిస్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 14 ఆగస్టు 2025 నుంచి మొదలై 13 సెప్టెంబర్ 2025 వరకు కొనసాగుతుంది. కాబట్టి, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://er.indianrailways.gov.in/ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. NCVT లేదా SCVT సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 15 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము:
జనరల్/ OBC/ EWS అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC/ ST/ PH మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము ఉండదు.