IFFCO AGT Recruitment : ఇఫ్కో లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీ

వయోపరిమితి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

IFFCO AGT Recruitment : ఇఫ్కో లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీ

IFFCO AGT Recruitment

IFFCO AGT Recruitment : న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వ్యక్తుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారు ఇఫ్కో సంస్థలు, జాయింట్ వెంచర్లు, భవిష్యత్తు ప్రాజెక్ట్‌లతో సహా భారతదేశంలో లేదా విదేశాలలోని వివిధ ప్రదేశాలలో గ్రాడ్యుయేట్ ట్రైనీలు పనిచేయాల్సి ఉంటుంది.

READ ALSO : Nara Lokesh Teleconference: రాజకీయ కక్ష సాధింపుల గురించి నాయకులంతా ప్రతీఇంటికి వెళ్లి ప్రచారం చేయాలి

బీఎస్సీ(అగ్రికల్చర్) డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 60 శాతం మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నవంబర్, 2023 నాటికి చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులే.

READ ALSO : TTD Bus Theft : టీటీడీ ఎలక్ట్రికల్ ఉచిత బస్సు చోరీ .. జీపీఎస్ ద్వారా గర్తింపు

వయోపరిమితి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో రూ.33,000 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ తర్వాత ఉద్యోగంలో చేరినవారికి నెలకు రూ.37,000-రూ.70,000 జీతం ఉంటుంది.

READ ALSO : AWES Recruitment : హైదరాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

అభ్యర్థులు అక్టోబర్ 7లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, లక్నో, నాగ్పుర్, గువాహటి, పట్నా, రాయ్పుర్, సూరత్, వారణాసి, చండీగఢ్, డెహ్రాడూన్, పుణె, కొచ్చిన్, జోధ్పుర్, జమ్మూ, సిమ్లా, భోపాల్, జబల్పూర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://agt.iffco.in/ పరిశీలించగలరు.