WCL Recruitment : వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

WCL Recruitment : వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

Recruitment of Apprentice Vacancies in Western Coalfields Limited

Updated On : November 4, 2022 / 8:21 PM IST

WCL Recruitment : భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలో ఉన్న వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 900 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, వైర్‌మెన్‌, సర్వేయర్, మెకానిక్‌ డీజిల్‌, డ్రాఫ్ట్‌మెన్‌, టర్నర్‌ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.

ఖాళీల వివరాలను పరిశీలిస్తే కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులు 216, ఫిట్టర్ పోస్టులు 221, ఎలక్ట్రీషియన్ పోస్టులు 228, వెల్డర్ పోస్టులు 59 , వైర్‌మ్యాన్ పోస్టులు 24, సర్వేయర్ పోస్టులు 9, మెకానిక్ డీజిల్ పోస్టులు 37, మేసన్ బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్ పోస్టులు 5, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) పోస్టులు 12, మెషినిస్ట్ పోస్టులు 13, టర్నర్ పోస్టులు: 11, పంప్ ఆపరేటర్ అండ్ మెకానిక్ పోస్టులు 5, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు 60 ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.7,700ల నుంచి రూ.8,050ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఫ్రెషర్లకు రూ.6000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 22, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.westerncoal.in/index1.php పరిశీలించగలరు.