ICSI Recruitment : న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో ఒప్పంద ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఐసీఎస్‌ఐలో ఇప్పటికే సభ్యత్వం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.33,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

Company Secretaries of India
ICSI Recruitment : భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని గురుగాన్‌లోని సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఐసీఎస్‌ఐలో ఇప్పటికే సభ్యత్వం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.33,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుదారుల వయసు 31 ఏళ్లకు మించకుండా ఉండాలి.
అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.icsi.edu/careers/ పరిశీలించగలరు.