WDCW AP Recruitment : విశాఖపట్నం గృహహింస రక్షణ విభాగంలో ఒప్పంద ఖాళీల భర్తీ

విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.

WDCW AP Recruitment : విశాఖపట్నం గృహహింస రక్షణ విభాగంలో ఒప్పంద ఖాళీల భర్తీ

Recruitment of contract vacancies in Visakhapatnam Domestic Violence Protection Department

Updated On : November 19, 2022 / 6:24 PM IST

WDCW AP Recruitment : ఆంధ్రప్రదేశ్‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం గృహహింస రక్షణ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన లీగల్‌ కౌన్సిలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ/బీఎల్ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. న్యాయవాదిగా కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. సొంత ప్రాక్టీస్‌ చేసే వారు అనర్హులు.

విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 23, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించవల్సి ఉంటుంది.

రఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా ; జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత రక్షణ అధికారి, గృహహింస చట్టం వారి కార్యాలయం, రెండవ ఆంతస్తు, ప్రగతి భవన్, సెక్టార్‌-9, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://visakhapatnam.ap.gov.in/ పరిశీలించగలరు.