Recruitment In BEL : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎలక్ట్రానిక్స్,మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

Bharat Electronics Limited
Recruitment In BEL :భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన 13 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎలక్ట్రానిక్స్,మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల వేతనంగా చెల్లిస్తారు.
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేది సెప్టెంబర్ 5, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bel-india.in/ పరిశీలించగలరు.