Recruitment Of Customs : భారత ప్రభుత్వ రంగానికి చెందిన కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ లో గ్రూప్ సీ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 8వ తరగతి, పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 5 నుంచి 10 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్లకు మధ్య ఉండాలి

Recruitment Of Customs : భారత ప్రభుత్వ రంగానికి చెందిన కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ లో గ్రూప్ సీ పోస్టుల భర్తీ

Vacancy for various posts in the office of Commissioner of Customs, Jamnagar, Gujarat

Updated On : October 19, 2022 / 6:40 PM IST

Recruitment Of Customs : భారత ప్రభుత్వ రంగానికి చెందిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయంలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ట్రేడ్‌మ్యాన్, ఇంజన్‌ డ్రైవర్‌ ఇదితర గ్రూప్‌ ‘సీ’ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి టిండెల్ పోస్టులు 5, సుఖాని పోస్టులు 10, ఇంజిన్ డ్రైవర్ పోస్టులు 4, లాంచ్ మెకానిక్ పోస్టులు 5, వ్యాపారి పోస్టులు 2, సీమాన్ పోస్టులు 1 ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 8వ తరగతి, పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 5 నుంచి 10 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్లకు మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు రూ.25,500ల నుంచి రూ,81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్‌ 14, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం హార్డు కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని నవంబర్‌ 15, 2022వ తేదీలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; అడ్రస్: అదనపు కమీషనర్ (P&V), కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్), జామ్‌నగర్-రాజ్‌కోట్ హైవే, విక్టోరియా వంతెన దగ్గర, జామ్‌నగర్-361001 (గుజరాత్). పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.jamnagarcustoms.gov.in/ పరిశీలించగలరు.