AAI ATC Notification : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలు మించకూడదు.

AAI ATC Notification : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

Airports Authority of India

Updated On : October 15, 2023 / 12:08 PM IST

AAI ATC Notification : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 496 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Plastic Water Cans : నిత్యం వాటర్ క్యాన్స్ లోని నీరు తాగుతున్నారా ? క్యాన్సర్, మధుమేహంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. సీబీటీ, వాయిస్‌ టెస్ట్‌, సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర విధానాల ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి వేతనంగా రూ.40000 – 140000 వరకు చెల్లిస్తారు.

READ ALSO : Glutathione : చర్మ అందానికి గ్లూటాతియోన్ ను ఇంజెక్షన్ గా తీసుకునేకంటే ఆహారాల రూపంలో తీసుకోవటం మేలా ?

దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది 30.11.2023 గా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజుగా రూ.1000. నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫిమేల్‌ ఏఏఐలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aai.aero/ పరిశీలించగలరు.