PGCIL Recruitment 2023 : పీజీసీఐఎల్‌లో జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (Junior Technician Trainee) పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 203 పోస్టులను భర్తీ చేస్తారు. ఐటీఐ(ITI-ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

PGCIL Recruitment 2023 : పీజీసీఐఎల్‌లో జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీ

PGCIL Recruitment 2023

PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (Junior Technician Trainee) పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 203 పోస్టులను భర్తీ చేస్తారు. ఐటీఐ(ITI-ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

READ ALSO : Priyanka Mohan : మరి ఇంత అందంగా ఉండకూడదు ప్రియాంక మోహన్..

వివరాలు..

మొత్తం ఖాళీలు: 203

జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల వివరాలు ;

నార్తర్న్ రీజియన్-I(NR-I): 15 పోస్టులు. అధికారిక పరిధి ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో కొంత భాగం, హర్యానాలో కొంత భాగం, ఉత్తరాఖండ్‌.

నార్తర్న్ రీజియన్-II(NR-II): 30 పోస్టులు. అధికారిక పరిధి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో కొంత భాగం, జమ్మూ & కశ్మీర్, లడఖ్, చండీగఢ్.

నార్తర్న్ రీజియన్-III(NR-III): 45 పోస్టులు. అధికారిక పరిధి ఉత్తరాఖండ్‌లో కొంత భాగం, ఉత్తరప్రదేశ్‌లో కొంత భాగం, మధ్యప్రదేశ్‌లో కొంత భాగం.

ఈస్టర్న్ రీజియన్-I (ER-I): 08 పోస్టులు. అధికారిక పరిధి బిహార్, జార్ఖండ్.

READ ALSO : Vishakapatnam : బోట్లు ఎలా కాలిపోయాయో చెప్పిన విశాఖ సీపీ

ఈస్టర్న్ రీజియన్-I (ER-II): 10 పోస్టులు. అధికారిక పరిధి బిహార్, జార్ఖండ్.

సదరన్ రీజియన్-I (SR-I): 20 పోస్టులు. అధికారిక పరిధి అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొంత ప్రాంతం.

సదరన్ రీజియన్-II (SR-II): 30 పోస్టులు. అధికారిక పరిధి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొంత ప్రాంతం.

వెస్ట్రర్న్ రీజియన్-II (WR-II): 05 పోస్టులు. అధికారిక పరిధి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొంత ప్రాంతం.

నార్త్-ఈస్టర్న్ రీజియన్-I (NER): 40 పోస్టులు. అధికారిక పరిధి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర.

READ ALSO : JEE Advanced 2024 : JEE అడ్వాన్స్‌డ్ 2024 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ఇదే !

అర్హత:

ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ , ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

READ ALSO : Priyanka Gandhi Dance : ఎన్నికల ప్రచార రథంపై ప్రియాంక గాంధీ డ్యాన్స్‌ .. ఉత్సాహంతో ఊగిపోయిన కార్యకర్తలు

ఎంపిక ప్రక్రియ:

సీబీటీ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.18,500 స్టైపెండ్‌గా ఇస్తారు. తదనంతరం నెలకు రూ.21,500-రూ.74000 పే స్కేల్ అమలుచేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ;

స్టెప్ 1 ; ఆన్‌లైన్ ఖాళీ దరఖాస్తు ఫారమ్‌ను దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి నోటిఫికేషన్‌ను చదువుకోవాలి.

స్టెప్ 2 ; అర్హతలు, ID ప్రూఫ్, చిరునామా, ప్రాథమిక వివరాలు వంటి అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి.

స్టెప్ 3 ; ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైన దరఖాస్తు ఫారమ్‌కు సంబంధించిన స్కాన్ చేసిన పత్రాలను అప్ లోడ్  చేసుకోవాలి.

స్టెప్ 4 ; దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు ప్రివ్యూ, అన్నివివరాలు జాగ్రత్తగా చూడాలి.

స్టెప్ 5 ;ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజు చెల్లించాలి.

స్టెప్ 6 ; దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

READ ALSO : Priyanka Gandhi: ఉద్యోగం కావాలంటే కేసీఆర్‌ను ఓడించాలి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్

ముఖ్యసమాచారం ;

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 12.12.2023.గా నిర్ణయించారు.

పరీక్ష తేదీ: జనవరి 2024

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://powergrid.in/ పరిశీలించగలరు.