BHEL Recruitment : బెంగళూరు బీహెచ్ఈఎల్ లో ప్రాజెక్ట్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 60 శాతం కనీస మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాది పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.

BHEL Recruitment
BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెంగళూరులో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 60 శాతం కనీస మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాది పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకకు సంబంధించి పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలుగా నెలకు 43,550 చెల్లిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులు పంపేందుకు చివరి తేది 29 ఏప్రిల్ 2023గా నిర్ణయించారు. ఆఫ్ లైన్ దరఖాస్తులకు మే 6, 2023 తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bhel.com/ పరిశీలించగలరు.