CSIR CRRI Recruitment : సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీ

రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,21,641ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు మార్చి 29, 2023వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

CSIR CRRI Recruitment : సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీ

CSIR CRRI Recruitment :

Updated On : February 24, 2023 / 2:14 PM IST

CSIR CRRI Recruitment : భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సైంటిస్ట్‌ గ్రేడ్‌-4 పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Deepika Pilli : మాల్దీవ్స్‌లో పొట్టి డ్రెస్సులో, చెవిలో పువ్వుతో రచ్చ చేస్తున్న దీపికా పిల్లి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,21,641ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు మార్చి 29, 2023వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక వెబ్ సైట్ ; https://crridom.gov.in/ పరిశీలించగలరు.