TS DME Recruitment : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టుల భర్తీ

విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పొడిగిస్తారు.

TS DME Recruitment : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టుల భర్తీ

TS DME Recruitment

TS DME Recruitment : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆమేరకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య విద్య కాలేజీలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కాంట్రాక్టు విధానంలో భర్తీ చేపట్టనున్నారు.

READ ALSO :Rapper Cardi B : సింగర్‌పై ఆల్కహాల్ విసిరిన వ్యక్తి.. సీరియస్ అయి సింగర్ ఏం చేసిందో తెలుసా?

వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం, కామారెడ్డి, వికారాబాద్‌, జనగామ, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నిర్మల్‌, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఈ పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : China: తైవాన్ మాదే.. మధ్యలో మీరు వచ్చారో..: మరోసారి కలకలం రేపిన చైనా

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి.

READ ALSO : Nellore : నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ

విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పొడిగిస్తారు.

READ ALSO : Leafy Vegetables : వర్షాకాలం ఆకు కూరలు తినడానికి సరైన సమయం కాదట

ఆసక్తి కలవారు ఈ మెయిల్‌ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 9న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపికైనవారు ఆగస్టు 24లోగా జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://dme.telangana.gov.in/ పరిశీలించగలరు.