Scholarships : డిగ్రీ విద్యార్ధులకు స్కాలర్ షిప్ ల దరఖాస్తులను ఆహ్వానిస్తున్న రిలయన్స్ పౌండేషన్ !
ఇంటర్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు లోపు ఉండాలి. అయితే రూ. 2.50 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.

Reliance Foundation invites applications for scholarships for degree students!
Scholarships : డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్‌లో భాగంగా సుమారు 5 వేల మంది విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తోన్న ఈ స్కాలర్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థలో అండర్ గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది చదువుతూ ఉండాలి.
ఇంటర్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు లోపు ఉండాలి. అయితే రూ. 2.50 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.
ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అడ్రస్ ప్రూఫ్, 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్ మార్క్స్ షీట్‌తో పాటు ప్రస్తుత బోనఫైడ్ సర్టిఫికెట్ ఉండాలి. వీటితో పాటు ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు 2013 ఫిబ్రవరి 14వ తేదీని చివరి తేదీతగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.scholarships.reliancefoundation.org/ పరిశీలించగలరు.