Replacement : కృష్ణా జిల్లాలో 129 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ

అభ్యర్ధులకు నెలకు రూ. 21,000 నుంచి రూ. 1,10,000 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

Replacement : కృష్ణా జిల్లాలో 129 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ

Health Jobs

Updated On : March 20, 2022 / 6:58 AM IST

Replacement : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కృష్ణ జిల్లాలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో 129 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత రంగంలో బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌, బీపీటీ, బీఎస్సీ, పీజీ, ఎండీ, ఎంఎస్‌లో ఉత్తీర్ణ‌త సాధించాలి.

అభ్యర్ధులకు నెలకు రూ. 21,000 నుంచి రూ. 1,10,000 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఈ పోస్టుల దరఖాస్తుకు మార్చి 25, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. ఎంపిక విధానానికి సంబంధించి 100 మార్కులు అభ్య‌ర్థుల‌కు కేటాయిస్తారు. వాటిలో 75 మార్కులు విద్యార్హ‌త మెరిట్ ద్వారా కేటాయిస్తారు. 10 మార్కులు అక‌డామిక్ అర్హ‌త సాధించిన సంవ‌త్స‌రం నుంచి ఏడాదికి ఒక్క‌టి చోప్పున కేటాయిస్తారు. 15 మార్కులు ఇతర నిబంధ‌న‌ల ద్వారా కేటాయిస్తారు.

పూర్తి చేసిన దరఖాస్తులను పంపాల్సిన చిరునమా ; డీఎంహెచ్ఓ కృష్ణా, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు, నోటిఫికేష‌న్ తదితర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://krishna.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.