Army Jobs : ఈస్టర్న్ కమాండ్ ఆర్మీలో పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులన్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

Army
Army Jobs : ఈస్టర్న్ కమాండ్ ఆర్మీ పరిధిలోని వివిధ ఏఎంసీ యూనిట్లలో గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 158 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో బార్బర్, చౌకీదార్, ఎల్ డీసీ, సఫాయివాలా, హెల్ ఇన్ స్పెక్టర్, కుక్, వార్డ్ సహాయక్ తదితర పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులన్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో ట్రేడ్, కోర్సు సర్టిఫికెట్లతో పాటు పనిలో అనుభవం కలిగి ఉన్న వారు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://indianarmy.nic.in/పరిశీలించగలరు.