RRB JE Admit Card 2024 : ఆర్ఆర్‌బీ జేఈ అడ్మిట్ కార్డు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి!
RRB JE Admit Card 2024 : ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 1 పరీక్ష డిసెంబర్ 16, 17, 18, 2024 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు, 100 మల్టీ ఆప్షనల్ ప్రశ్నలు ఉంటాయి.

RRB JE Admit Card 2024 Released
RRB JE Admit Card 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ (JE) రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో విడుదల చేసింది. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1)కి హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని సమర్పించడం ద్వారా తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 1 పరీక్ష డిసెంబర్ 16, 17, 18, 2024 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు, 100 మల్టీ ఆప్షనల్ ప్రశ్నలు ఉంటాయి.
ఆర్ఆర్‌బీ జేఈ అడ్మిట్ కార్డ్ 2024 డైరెక్ట్ లింక్ (డౌన్‌లోడ్ క్లిక్ చేయండి) :
ఆర్ఆర్‌బీ జేఈ అడ్మిట్ కార్డ్ 2024 : హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేయండి :
- మీ ఆర్ఆర్‌బీ జేఈ అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసేందుకు ఈ కిందివిధంగా ఫాలో చేయండి.
- ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో, ఆర్ఆర్‌బీ జేఈ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని సమర్పించాల్సిన చోట కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆర్ఆర్‌బీ జేఈ హాల్‌టికెట్ మీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.
- పరీక్ష రోజు కోసం ప్రింటవుట్ తీసుకోండి.
ఆర్ఆర్‌బీ జేఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. సీబీటీ1, సీబీటీ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ (ME) ఉన్నాయి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 29, 2024న ముగిసింది.
మొత్తం 7,951 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వీటిలో 17 పోస్టులు కెమికల్ సూపర్‌వైజర్/రీసెర్చ్, మెటలర్జికల్ సూపర్‌వైజర్/రీసెర్చ్, 7,934 పోస్టులు జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉన్నాయి.
Read Also : CBSE Practical Exam Dates : సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ ఎగ్జామ్ తేదీలివే.. ఫుల్ గైడ్‌లైన్స్!