RRB Recruitment : నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. రైల్వేలో 4600 ఉద్యోగాలు.. అంతా ఒట్టి అబద్దం.. స్ప‌ష్టం చేసిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఎవ‌రికి ఆశ ఉండ‌దు.

RRB Recruitment : నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. రైల్వేలో 4600 ఉద్యోగాలు.. అంతా ఒట్టి అబద్దం.. స్ప‌ష్టం చేసిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

RRB RPF Constable and SI recruitment for 4660 posts FAKE

ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఎవ‌రికి ఆశ ఉండ‌దు. అది రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగ‌మైనా, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగ‌మైనా స‌రే. ఇక నిరుద్యోగుల సంగ‌తి చెప్పేది ఏముంది. ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం రాత్రింబ‌వ‌ళ్లు ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో నోటిఫికేష‌న్ల‌ కోసం వేయిక‌ళ్ల‌తో ఎదురుచూస్తుంటారు. కాగా.. ఇటీవ‌ల భార‌తీయ రైల్వేలో 4,660 ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైదంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఇంకేముంది అది నిజ‌మో కాదో అని తెలుసుకోకుండా అప్లై చేసుకునేందుకు ల‌క్ష‌లాది మంది రైల్వే వెబ్‌సైట్‌కు వెళ్లి సెర్చ్ చేయ‌డం ప్రారంభించారు. అయితే.. సైట్‌లో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన ఎలాంటి స‌మాచారం లేదు. ఈ విష‌యం రైల్వే శాఖ దృష్టికి చేరింది. దీనిపై ద‌క్షిణ మ‌ధ్య‌రైల్వే స్పందించింది. స‌ద‌రు నోటిఫికేష‌న్ న‌కిలీది అని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి న‌కిలీ ఉద్యోగ నోటిఫికేష‌న్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ సూచించింది.

TS POLYCET 2024 : టీఎస్ పాలిసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. మే 17న పరీక్ష

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్లు-ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేద‌ని తెలిపింది. ఏప్రిల్‌ 15 నుంచి మే 14 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆ ఫేక్ ప్రకటనలో ఉంది.

ఈ నోటిఫికేష‌న్ న‌కిలీద‌ని ఇప్ప‌టికే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తెలిపింది. ఫేక్ నోటిఫికేష‌న్ల ప‌ట్ల నిరుద్యోగులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. నోటిఫికేష‌న్ నిర్ధార‌ణ కోసం భార‌తీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను చూడాల‌ని కోరింది.

TS EAPCET 2024 : తెలంగాణ ఎంసెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలు ఇవే, ఎలా అప్లయ్ చేసుకోవాలంటే?