TS POLYCET 2024 : టీఎస్ పాలిసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. మే 17న పరీక్ష

TS POLYCET 2024 : తెలంగాణ పాలిసెట్ 2024 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మే 17న జరగనుంది.

TS POLYCET 2024 : టీఎస్ పాలిసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. మే 17న పరీక్ష

TS POLYCET 2024 registration begins, exam on May 17

TS POLYCET 2024 : స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌లో (POLYCET 2024) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం (polycet.sbtet.telangana.gov.in)ని విజిట్ చేయొచ్చు.

అందిన వివరాల ప్రకారం.. అభ్యర్థులు టీఎస్ పాలిసెట్ 2024 రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిసెట్ పరీక్ష మే 17, 2024న జరగాల్సి ఉంది. 12 రోజుల పరీక్ష తర్వాత రిజిల్ట్స్ వెల్లడి కానున్నాయి. టీఎస్ పాలిసెట్ 2024 ఫలితాల కచ్చితమైన తేదీ, సమయం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Read Also : TS Inter Exams 2024: ఇంటర్ పరీక్షలు షురూ.. విద్యార్థులు తప్పనిసరిగా ఈ సూచనలు పాటించాలి

ముఖ్యమైన తేదీలివే :

  • పాలిసెట్ 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
  • ఫీజుతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ : ఏప్రిల్ 22, 2024
  • ఎస్సీ అండ్ ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500
  • రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు పూర్తి చేయడానికి చివరి తేదీ : ఏప్రిల్ 24, 2024
  • తత్కాల్ రుసుముతో రూ. 300 రుసుము చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 26, 2024

పాలిసెట్-2024 పరీక్ష తేదీ : మే 17, 2024
పాలిసెట్ ఫలితాలు : 12 రోజుల పరీక్ష తర్వాత ప్రకటించనున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా :

  • టీఎస్ పాలిసెట్ 2024 కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కిందివిధంగా ప్రయత్నించవచ్చు.
  • అధికారిక వెబ్‌సైట్‌ sbtet.telangana.gov.in విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో, ‘More Serviecs’ ట్యాబ్‌లో ఉన్న పాలిసెట్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  • స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ఫారమ్ ఎంచుకోండి. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
  • దరఖాస్తు రుసుమును చెల్లించి, మీ దరఖాస్తును సమర్పించండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోండి.
  • టీఎస్ పాలిసెట్ 2024 కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ లింక్‌ (https://polycet.sbtet.telangana.gov.in)పై క్లిక్ చేయవచ్చు.

అర్హతలు :
ఎస్ఎస్‌సీ లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంకా, టీఎస్ పాలిసెట్2024 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. కంపార్ట్‌మెంటల్‌గా ఉత్తీర్ణులైన లేదా ఎస్ఎస్‌సీ 2024కి హాజరయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.

Read Also : AP TET 2024 Exams : ఫిబ్రవరి 27 నుంచే ఏపీ టెట్ పరీక్షలు.. పరీక్ష సమయం, తేదీలివే..!