RRC ER Recruitment 2025: పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. పది, ఐటీఐ అర్హతతో ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు.. ఒక్క క్లిక్ తో అప్లై చేసుకోండి ఇలా

RRC ER Recruitment 2025: కోల్‌కతా – ఆర్‌ఆర్‌సీ (RRC) ద్వారా మొత్తం 3,115 అప్రెంటిస్ పోస్టులను భర్తీ భర్తీ చేయనుంది.

RRC ER Recruitment 2025: పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. పది, ఐటీఐ అర్హతతో ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు.. ఒక్క క్లిక్ తో అప్లై చేసుకోండి ఇలా

RRC ER has released a notification for the recruitment of Apprentice posts.

Updated On : August 8, 2025 / 7:39 AM IST

నిరుద్యోగులకు ఇలా నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పులు. రాత పరీక్షా లేదు, ఇంటర్వ్యూ అంతకన్నా లేదు. కేవలం మీ సాధించిన మెరిట్ ఆధారంగా చేసుకొని అద్భుతమైన జాబ్స్ పొందవచ్చు. అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈస్ట్రన్ రైల్వేలో. ఈ సంస్థ ఇటీవలే నోటిఫికేషన్ విడదల చేసింది. కోల్‌కతా – ఆర్‌ఆర్‌సీ (RRC) ద్వారా మొత్తం 3,115 అప్రెంటిస్ పోస్టులను భర్తీ భర్తీ చేయనుంది. కాబట్టి.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్ సైట్ https://rrcer.org ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

డివిజన్/వర్క్‌షాప్ ల వారీగా ఖాలీల వివరాలు:

  • హౌరా డివిజన్ లో 659 పోస్టులు
  • లిలువా వర్క్‌షాప్ లో 612 పోస్టులు
  • సీల్డా డివిజన్ లో 440 పోస్టులు
  • కాంచ్రపార వర్క్‌షాప్ లో 187 పోస్టులు
  • మాల్డా డివిజన్ లో 138 పోస్టులు
  • అసన్సోల్ డివిజన్ లో 412 పోస్టులు
  • జమలాపూర్ వర్క్‌షాప్ లో 667 పోస్టులు

పోస్టుల వివరాలు:
ఫిట్టర్, మెకానికల్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, పెయింటర్, ఎలక్ట్రిషియన్, ఆర్‌ఈఎఫ్–ఏసీ మెకానిక్

అర్హతలు:
అభ్యర్థులు తప్పకుండా పదో తరగతి / ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక విధానం:
ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.