SBI PO Recruitment 2025: ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ పై కీలక అప్డేట్.. అడ్మిట్ కార్డ్స్ విడుదల అయ్యేది అప్పుడే.. ఎగ్జామ్, సెలెక్షన్ ప్రాసెస్, పూర్తి డీటెయిల్స్

SBI PO Recruitment 2025: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ పీవో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

SBI PO Recruitment 2025: ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ పై కీలక అప్డేట్.. అడ్మిట్ కార్డ్స్ విడుదల అయ్యేది అప్పుడే.. ఎగ్జామ్, సెలెక్షన్ ప్రాసెస్, పూర్తి డీటెయిల్స్

SBI PO Admit card 2025 update

Updated On : July 17, 2025 / 2:01 PM IST

ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ పీవో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డుల విడుదల కీలకంగా మారింది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు జులై మూడవ లేదా నాలుగవ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి, అభ్యర్థులు రెగ్యులర్ గా అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇక ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే.. ముందుగా ఆగస్టులో నిర్వహించాలని, రిజల్ట్స్ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్స్ ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ sbi.co.in లోకి వెళ్ళాలి
  • హోమ్‌పేజీలో కెరీర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • ప్రస్తుత ఖాళీల క్రింద “ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకం”పై క్లిక్ చేయాలి
  • తరువాత అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ అనే లింక్‌ పై క్లిక్ చేయాలి
  • అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి
  • అప్పుడు మీ మీ అడ్మిట్ కార్డ్‌ డిస్ప్లే అవుతుంది
  • దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి

ఎస్బీఐ పీవో 2025 ఎంపిక విధానం:

ఎస్బీఐ పీవో 2025 ఎంపిక విధానం మూడు విభాగాల్లో జరుగుతుంది

  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ – ఆబ్జెక్టివ్
  • మైన్స్ ఎగ్జామినేషన్ – ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండూ పరీక్షలు ఉంటాయి
  • ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్

మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలో కనబరిచిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.