Inter Syllabus 2025-26: ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్.. ఈ ఇయర్ నుంచే 6 కొత్త కోర్సులు

ఇప్పటివరకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డాటా అనాలసిస్‌, ఏఐఎంఎల్‌, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు బీటెక్‌లో ఉండేవే. ఇప్పుడు ఈ సబ్జెక్టులను ఇంటర్ నుంచే నిరూపించాలని నిర్ణయాలు తీసుకుంది.

Inter Syllabus 2025-26: ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్.. ఈ ఇయర్ నుంచే 6 కొత్త కోర్సులు

B.Tech subjects from intermediate education onwards

Updated On : June 4, 2025 / 4:36 PM IST

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ నుండే బీటెక్ సబ్జెక్టులను విద్యార్థులకు నేర్పించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డాటా అనాలసిస్‌, ఏఐఎంఎల్‌, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు బీటెక్‌లో ఉండేవే. ఇప్పుడు ఈ సబ్జెక్టులను ఇంటర్ నుంచే నిరూపించాలని నిర్ణయాలు తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరం 2025-26 నుంచే ప్రారంభించాలని కూడా అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డాటా అనాలసిస్‌, ఏఐఎంఎల్‌, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ ఆరు కొత్త కోర్సులు ఇంటర్మీడియట్ నుండే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.

2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ విద్యా కమిషనరేట్‌ అధికారులు ముందుగా సర్కారు జూనియర్‌ కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కూకట్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో కీలకమైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డాటా అనలిసిస్‌ కోర్సును, నల్లగొండ ప్రభుత్వ వొకేషనల్‌ కాలేజీలో బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, ఫలక్‌నుమాలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కాలేజీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వొకేషనల్‌ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీడియో ఇంజినీరింగ్‌, బజార్‌ఘాట్‌(హైదరాబాద్‌) ప్రభుత్వ వొకేషనల్‌ జూనియర్‌ కాలేజీలో సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్‌ అండ్‌ సెక్యూరిటీ కోర్సు, హనుమకొండ ప్రభుత్వ వొకేషనల్‌ జూనియర్‌ కాలేజీలో ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

మారుతున్న కాలమాన పరిస్థితులు, టెక్నాలజీ కారణంగానే రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఎంత ముందు వెళుతున్నా ఇంకా పాత సబ్జెక్టులనే విద్యార్థులకు బోధించడం సరికాదని, ఇంటర్ నుండే వారికి టెక్నీకల్ ఎజుకేషన్ అందిస్తే ముందు ముందు చాలా సహాయపడుతుంది అని భావించారని సమాచారం. ఈ కోర్సుల వల్ల విద్యార్థులకు ముందు నుండే ఆయా సబ్జెక్టులపైనా అవగాహనా ఏర్పడుతుంది. నిజానికి ఇంటర్ తరువాత బీటెక్ లో అప్పటివరకు అహగాహన లేని చాలా సబ్జెక్టులను విద్యార్థులు అభ్యసించాల్సి ఉంటుంది. అది వారికి భారమే. కాబట్టి.. బీటెక్ లో చెప్పబోయే కొన్ని సబ్జెక్టులను ఇలా ఇంటర్ నుంచే పరిచయం చేయడం మంచిదే. కాబట్టి.. కాబట్టి ఇంటర్ విద్యార్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మరి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.