చెక్ ఇట్: రైల్వేలో 617 జేఈ, టికెట్ క్లర్క్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : March 26, 2020 / 05:23 AM IST
చెక్ ఇట్: రైల్వేలో 617 జేఈ, టికెట్ క్లర్క్ పోస్టులు

Updated On : March 26, 2020 / 5:23 AM IST

సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.   అసిస్టెంట్ లోకో పైలట్(ALP), టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జేఈ లాంటి పోస్టుల్ని భర్తీ చేసింది. ఇందులో మొత్తం 617 ఖాళీలు ఉన్నాయి. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ GDCE ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ఈ పోస్టులకు ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఆసక్తి, అర్హతగల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మంగళవారం (మార్చి 24, 2020)న ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరితేది ఏప్రిల్ 23. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ అభ్యర్ధులకు 42ఏళ్ల వయసు ఉండాలి. SC, STఅభ్యర్ధులకు 47ఏళ్లు ఉండాలి. OBCఅభ్యర్ధులకు 45ఏళ్లు ఉండాలి. 

దరఖాస్తు చేసుకోడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక విద్యార్హత విషయానికి వస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్ లోకోపైలట్ 324 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 63, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 68, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 84, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 70 జేఈ పోస్టులు ఉన్నాయి.  జేఈలో P.Way-3, జేఈ Works-2, జేఈ Signal-1, జేఈ Tele-1 ఇలా మొత్తం 617పోస్టులు ఉన్నాయి.